
కెమెరామన్లను చూసి నయన్ చిరునవ్వులు చిందిస్తూనే బుడ్డోడిని జాగ్రత్తగా అదిమిపట్టుకుంది. పిల్లలిద్దరికీ సేమ్ డ్రెస్సులు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
సౌత్ స్టార్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే! తొలిసారి పిల్లలతో కలిసి వీరిద్దరూ దర్శనమిచ్చారు. మార్చి 8న ముంబై ఎయిర్‌పోర్టులో నయన్, విఘ్నేశ్.. చెరొక బాబును ఎత్తుకుని కనిపించారు. దీంతో మీడియా వారిని ఫోటోలు క్లిక్‌మనిపించే ప్రయత్నం చేశాయి. కానీ ఈ దంపతులు మాత్రం తమ పిల్లల ఫోటోలు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. కెమెరామన్లను చూసి నయన్ చిరునవ్వులు చిందిస్తూనే బుడ్డోడిని జాగ్రత్తగా అదిమిపట్టుకుంది. పిల్లలిద్దరికీ సేమ్ డ్రెస్సులు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఇకపోతే నానుం రౌడీ ధాన్ సినిమా సెట్స్‌లో నయన్, విఘ్నేశ్ మధ్య ప్రేమ చిగురించింది. చాలాకాలం పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ 2022 జూన్ 9న పెళ్లి పీటలెక్కారు. వీరి వివాహ వేడుకకు రజనీకాంత్, షారుక్ ఖాన్, విజయ్ సేతుపతి సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లి జరిగి ఏడాది పూర్తికాకముందే సరోగసి ద్వారా పేరెంట్స్ అయ్యారు.