శ్రీవారిని దర్శించుకున్న నయనతార దంపతులు | Newly Wed Couple Nayanthara, Vignesh Shivan Visits Tirumala Tirupati | Sakshi
Sakshi News home page

Nayanthara-Vignesh Shivan: శ్రీవారిని దర్శించుకున్న నయనతార దంపతులు

Published Fri, Jun 10 2022 2:08 PM | Last Updated on Fri, Jun 10 2022 3:13 PM

Newly Wed Couple Nayanthara, Vignesh Shivan Visits Tirumala Tirupati - Sakshi

హీరోయిన్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న గురువారం మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ఈ లవ్‌బర్డ్స్‌.. దంపతులుగా తొలిసారిగా ఆలయాన్ని సందర్శించారు. ఈ రోజు వీఐపీ దర్శనం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఈ కొత్త జంట ప్రత్యేక పూజలు నిర్వహించారు.  దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ నూతన వధువరులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు.

కాగా ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్‌-విక్కీలు జూన్‌ 9వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో జరిగిన వీరి వివాహ వేడుకకు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, హీరో కార్తీతో పాటు కోలీవుడ్‌కు చెందిన దర్శక-నిర్మాతలు సినీ ప్రముఖులు హజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తన మేనేజర్‌ పూజా దద్లానీ, డైరెక్టర్‌ అట్లీతో కలిసి ఈ వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement