నయనతార, విఘ్నేశ్ శివన్ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారిన విషయం అందరికీ తెలిసిందే! ఈ కవలలను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఈ దంపతులు తమ పిల్లల ముఖాలను మాత్రం ఇంతవరకు చూపించనేలేదు. కనీసం పేర్లు కూడా వెల్లడించలేదు. ఎప్పుడెప్పుడు వారి ముఖాలు రివీల్ చేస్తారా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. సస్పెన్స్‌కు తెర దించుతూ విఘ్నేశ్ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశాడు.
ఇందులో కిటికీ దగ్గర కూర్చున్న నయన్ చేతిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న పిల్లల పేర్లను కూడా బయటపెట్టాడు విఘ్నేశ్. 'ఉయిర్ రుద్రనీల్ ఎన్ శివన్, ఉలగ్ దైవిక్ ఎన్ శివన్.. ఈ ప్రపంచంలోనే ఉత్తమ తల్లి నయనతారకు సంకేతంగా ఇద్దరి పేర్లలో ఎన్‌ను చేర్చాం. మా పిల్లల పేర్లను పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. కాగా చాలాకాలం డేటింగ్‌లో ఉన్న నయన్, విఘ్నేశ్ 2022 జూన్ 9న పెళ్లిపీటలెక్కారు. అక్టోబర్‌లో సరోగసి ద్వారా కవలలకు పేరెంట్స్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment