Mahabalipuram: Vignesh Shivan To Direct Opening Ceremony Of 44th Chess Olympiad - Sakshi
Sakshi News home page

Director Vignesh Shivan: సీఎంను డైరెక్ట్‌ చేసిన విఘ్నేశ్‌ శివన్‌ 

Published Sat, Jul 9 2022 6:52 AM | Last Updated on Sat, Jul 9 2022 9:29 AM

Vignesh Shivan to direct Opening Ceremony Of 44th Chess Olympiad - Sakshi

చెన్నై: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ డైరెక్ట్‌ చేశారు. ఏంటీ నమ్మశక్యంగా లేదా? సీఎం స్టాలిన్‌ నటించడమేమిటని ఆశ్యర్యపోతున్నారా?  ఈ వార్త మాత్రం నిజం. అదేంటో చూద్దాం రండి. తమిళనాడులో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు చెస్‌ ఒలింపియాడ్‌ పోటీలు జరగనున్నాయి. చెన్నై సమీసంలోని మహాబలిపురంలో జరగనున్న ఈ క్రీడల్లో 186 దేశాలకు చెందిన 2 వేలకు పైగా చెస్‌ క్రీడాకారులు పాల్గొననున్నారు.

ఈ పోటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రచారాన్ని నిర్వహించ తలపెట్టింది. అందులో భాగంగా ఒక ప్రచార చిత్రాన్ని దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ రూపొందిస్తున్నారు. ఈ ప్రచార చిత్రంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఉన్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను ఇటీవలే నెప్పియార్‌ వంతెన వద్ద చిత్రీకరించారు. దీనికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని అందించడం విశేషం. 

చదవండి: (దూతతో ఎంట్రీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement