Vignesh Shivan Interesting Tweet On Nayanthara Jawan Movie New Poster Goes Viral - Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ అంతా గర్వ పడుతోంది.. నయనతారపై భర్త విఘ్నేష్‌ శివన్‌ ఆస్తకికర ట్వీట్‌

Published Wed, Jul 19 2023 12:00 PM | Last Updated on Wed, Jul 19 2023 12:38 PM

Vignesh Shivan Interesting Tweet On Nayanthara - Sakshi

దక్షిణాది లేడీ సూపర్‌ స్టార్‌గా వెలిగిపోతున్న నయనతార తొలిసారిగా బాలీవుడ్‌లో నటించిన చిత్రం జవాన్‌. షారూక్‌  ఖాన్‌ హీరోగా నటించిన ఇందులో నటి దీపికా పదుకోనే, ప్రియమణి, విజయ్‌ సేతుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కోలీవుడ్లో చాలా ఆసక్తి నెలకొంది. కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నయనతార, విజయ్‌ సేతుపతి, దర్శకుడు అట్లీలే. కాగా ఇందులోని నయనతార ఫొటోతో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో చేతిలో తుపాకీ, కూలింగ్‌ గ్లాస్‌ ధరించి ఫుల్‌ యాక్షన్‌ మూడ్‌ లో కనిపించారు.

దీనిపై ప్రేక్షకుల రియాక్షన్‌ ను పక్కన పెడితే నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ఆమెను యథాతథంగా పొగడ్తలతో ముంచెత్తారు. ఆ పోస్టర్‌ను తన ట్విట్టర్లో పోస్ట్‌ చేసి నయన్ ని చూస్తుంటే ఆనందంగా.. గర్వంగా ఉందన్నారు. షారూఖ్ ఖాన్ కి అభిమానిగా ఆయన నటించిన మూవీస్ అన్ని చూసిన నయన్.. ఇప్పుడూ షారూఖ్ మూవీలో మెయిన్ రోల్ లో నటించడం గర్వంగా ఉందన్నారు. ‘నువ్వు ఎంతోమంది స్ఫూర్తినిస్తున్నావు.. నిన్ను చూసి నేనొక్కడినే కాదు మన ఫ్యామిలీ మొత్తం ఎంతో గర్వంగా ఫీల్ అవుతోంది’ అంటూ నయనతారను ఆకాశానికెత్తారు.

ఈ ట్వీట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ గా మారింది. కాగా అంతకు ముందు నయనతార పోస్టర్‌ను విడుదల చేసిన సందర్భంగా నటుడు షారుక్‌ ఖాన్‌ తన ట్విటర్‌ లో తుఫాన్‌కు ముందు పిడుగు అని పోస్ట్‌ చేశారు. దీంతో నయనతార అటు బాలీవుడ్‌లోనూ దుమ్ము రేపుతారంటూ ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement