
నయనతార వంటి ప్రముఖ నటీనటులకు అవకాశాలు తగ్గే చాన్స్ ఉండదు. ఒకవేళ తగ్గినా వారే స్వయంగా చిత్రాలను నిర్మించడానికి సిద్ధమవుతారు. కాగా ప్రస్తుతం నయనతారకు అవకాశాలు తగ్గే అవకాశమే లేదు. అయితే విజయాలకు దూరం అవుతున్న ఈ లేడీ సూపర్‌స్టార్ మళ్లీ సక్సెస్ బాట పట్టే ప్రయత్నంలో సొంతంగా చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈమె ఇటీవల జయంరవి సరసన నటించిన ఇరైవన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఆ తరువాత నటించిన లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం 'అన్నపూరణి' కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం మాధవన్, సిద్ధార్థ్‌తో కలిసి టెస్ట్ చిత్రంలో ఆమె నటిస్తుంది. కాగా భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా పలు చిత్రాలను నిర్మించడంతో పాటు, అనేక సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు.
తాజాగా సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో నటించడానికి నయనతార సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ చిత్రాలు నయనతార విఘ్నేష్ శివన్ తమ రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఎలాగైన ఈ చిత్రంతో హిట్ కొట్టాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కనెక్ట్ చిత్రం తరువాత రౌడీ పిక్చర్స్ సంస్థ నిర్మించే చిత్రం ఇదే అవుతుంది. కాగా ఇది కచ్చితంగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా ఇంకా వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment