
కోలీవుడ్‌లో సంచలన జంట ఎవరైనా ఉన్నారంటే అది నయనతార, విఘ్నేశ్ శివన్‌నే. వీరు సుదీర్ఘ ప్రేమలో ఉన్న తరువాత పెళ్లికి సిద్ధం అయ్యారు. 2022 జూన్ 9వ తేదీన వివాహం చేసుకున్నారు. అలాగే సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వారికి ఉయిర్, ఉలగం అని నామకరణం చేశారు. పెళ్లికి ముందు వరకూ పుట్టిన రోజులు, పండుగలు అంటూ ట్రిప్పుకు వెళ్తూ.. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేవారు.
రాక కోసం ఎదురుచూశాం
ఇప్పుడు తమ కవల పిల్లలతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా విదేశానికి వెళ్లిన భర్త విఘ్నేశ్ శివన్‌ను ఎంతగానో మిస్ అయ్యామంది నయనతార. తాను, తన పిల్లలు అతడి రాకకోసం ఎదురు చూశామని, విఘ్నేశ్ శివన్ తిరిగి వచ్చిన తరువాత ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారో తెలుపుతూ ఇన్‌స్ట్రాగామ్‌లో ఫోటోలు షేర్ చేసింది.
మాటల్లో చెప్పలేం..
విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం ఏల్‌ఐసీ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా, నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కోసం ఇటీవల సింగపూర్ వెళ్లారు. ఈ చిత్రం సింగపూర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా నయనతార తన ఇన్‌స్ట్రాగామ్‌లో '20 రోజుల ఎదురుచూపుల తర్వాత నిన్ను చూస్తుంటే మాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేము. నిన్ను ఎంతో మిస్ అయ్యాం' అని పేర్కొన్నారు. అందులో పిల్లలతో కలిసున్న ఫొటోలను పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment