Viral Video: Nayanthara, Vignesh Shivan Deliver New Year Gifts to Children - Sakshi
Sakshi News home page

Nayanthara: రోడ్డు పక్కన పేదలకు నయన్‌ దంపతుల బహుమతులు

Jan 4 2023 12:50 PM | Updated on Jan 4 2023 1:47 PM

Nayanthara, Vignesh Shivan Delivered New Year Gifts to Children, Video Viral - Sakshi

పిల్లలకు గిఫ్టులు పంపిణీ చేశారు. సెలబ్రిటీలు నేరుగా తమ దగ్గరకు వచ్చి మరీ బహుమతులిస్తుండటంతో అక్కడున్న వారు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక ఈ

కొన్నేళ్లపాటు ప్రేమ లోకంలో విహరించిన కోలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ నయన్‌ - విఘ్నేశ్‌ ఎట్టకేలకు గతేడాది పెళ్లి చేసుకున్నారు. సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు కూడా అయ్యారు. దీంతో గతేడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ నూతన సంవత్సరానికి వెరైటీగా అండ్‌ గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు. పూజలు, పార్టీల సంగతి ఏమో కానీ పేదలకు ఊహించని బహుమతులిచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రోడ్డు పక్కన కారు ఆపిన నయన్‌ దంపతులు అక్కడున్న కొందరు మహిళలకు, పిల్లలకు గిఫ్టులు పంపిణీ చేశారు. సెలబ్రిటీలు నేరుగా తమ దగ్గరకు వచ్చి మరీ బహుమతులిస్తుండటంతో అక్కడున్న వారు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మీ గొప్ప మనసుకు హ్యాట్సాఫ్‌, ఇందుకే కదా మిమ్మల్ని లేడీ సూపర్‌ స్టార్‌ అనేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నయనతార ఇటీవల కనెక్ట్‌ సినిమాలో నటించింది. ఇది తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ రిలీజైంది. అశ్విన్‌ శరవణన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో వినయ్‌ రాయ్‌, అనుపమ్‌ ఖేర్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

చదవండి: పారితోషికంతో కూతురికి కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి
నేను కోరుకుంది ఇదే, సంతోషంగా ఉంది: తమన్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement