Shah Rukh Khan Warns Nayanthara Husband Vignesh - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: నయన్‌తో జాగ్రత్త.. హెచ్చరించిన షారుక్!

Published Wed, Jul 12 2023 8:14 PM | Last Updated on Wed, Jul 12 2023 9:04 PM

Shah Rukh Khan Warning Nayanthara Husband - Sakshi

షారుక్ ఖాన్ మంచి ఊపు మీదున్నాడు. ఐదేళ్లుగా ఒక్క సినిమా చేయక సైలెంట్‌గా ఉన్న ఇతడు.. ఈ ఏడాది 'పఠాన్'తో హిట్ కొట్టాడు. రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాడు. త్వరలో 'జవాన్'తో రాబోతున్నాడు. దీని ట్రైలర్ ఈ మధ్యే రిలీజైంది. ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అయితే సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న షారుక్.. ఇప్పుడు నయనతార భర్తకి ఓ విషయమై హెచ్చరించాడు. ఆమెతో జాగ్రత్త ఉండని చెప్పుకొచ‍్చాడు. 

షారుక్‌తో కలిసి
లేడీ సూపర్‌స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే నయనతార.. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. దక్షిణాదిలో మిగతా హీరోయిన్లతో పోలిస్తే అత్యధిక పారితోషికం తీసుకుంటోంది. ఇన్నాళ్లు సౌత్‌కే పరిమితమైన నయన్.. షారుక్ 'జవాన్'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మధ్య రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే ఈ మూవీలో నయన్‌ది పోలీస్ క్యారెక్టర్.

(ఇదీ చదవండి: ఆమెని మర్చిపోలేకపోతున్న చిన్నల్లుడు కల్యాణ్ దేవ్!)

విఘ్నేశ్‌కి జాగ్రత్తలు
'జవాన్' ట్రైలర్ చూసిన నయన్ భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.. 'అట్లీ ఇలాంటి సూపర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటే గర్వపడకుండా ఎలా ఉండగలం. ఔట్‌ఫుట్ ఇంటర్నేషనల్ లెవల్లో ఉంది. హ్యాట్యాఫ్' అని పోస్ట్ పెట్టాడు. అలానే షారుక్ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇస్తున్నందుకు నయనతార, అనిరుధ్, విజయ్ సేతుపతికి విషెస్ చెప్పాడు. 

షారుక్ పంచులు
ఇక విఘ్నేశ్ శివన్ పోస్ట్ చూసిన షారుక్.. తనదైన శైలిలో స్పందించాడు. 'విఘ్నేశ్ శివన్ చూపిన ప్రేమకు థ్యాంక్స్. నయనతార అద్భుతంగా చేసింది. అయితే నేను చెప్పబోయేది మీకు ముందే తెలుసనుకుంటాను. కానీ జాగ్రత్త. ఆమె కొన్ని భారీ కిక్స్, పంచులు నేర్చుకుంది' అని షారుక్ ఫన్నీగా విఘ్నేశ్‌కి సలహాలు ఇచ్చాడు. ఇప్పుడిది వైరల్‌గా మారింది.

(ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement