బాహుబలి-2 ట్రైలర్‌ పీక్‌ సీన్‌ వచ్చేసింది | Sneak peek of 'Baahubali 2' trailer released | Sakshi
Sakshi News home page

బాహుబలి-2 ట్రైలర్‌ పీక్‌ సీన్‌ వచ్చేసింది

Published Mon, Mar 13 2017 11:57 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

బాహుబలి-2 ట్రైలర్‌ పీక్‌ సీన్‌ వచ్చేసింది

బాహుబలి-2 ట్రైలర్‌ పీక్‌ సీన్‌ వచ్చేసింది

చెన్నై: బాహుబలి-2 సునామీ షురూ అయింది. ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పిక్చర్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విశేషాలతో ఇప్పటికే బాహుబలిని మించిన స్థాయిలో బాహుబలి-2కి ప్రచారం ప్రారంభించిన చిత్ర యూనిట్‌ తాజాగా మరోసారి ప్రేక్షకుల ఆసక్తిని పీక్‌ స్టేజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ గురువారం విడుదల కానుండగా అప్పటి వరకు వెయిట్‌ చేయడం తమ వల్లకాదు అని ప్రేక్షకుడు అనుకునేంత రేంజ్‌లో ట్రైలర్‌లోని ప్రభాస్‌పై ఉన్న చిన్న నిడివి సీన్‌ను విడుదల చేసింది.

ఈ ట్రైలర్‌లో తాజాగా విడుదల చేసిన ఈ బిట్‌ సీన్‌ ఉత్తాన దశదని చెప్పుకోవచ్చంట. నిజానికి అది ఉండటం కూడా అలాగే ఉంది. తల నుంచి రక్తం కారుతుండగా రౌద్ర రూపంతో ఉన్న ప్రభాస్‌ కళ్లు ఎర్రజేసి శత్రువువైపుగా చూస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో చూస్తుంటే నిజంగానే ట్రైలర్‌కోసం ఏ మాత్రం వెయిట్‌ చేయబోమని అనుకునే అవకాశం లేకపోలేదు. బాహుబలి-2 ట్రైలర్‌ అధికారికంగా ఈ గురువారం (మార్చి-16)న విడుదలవుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement