బాహుబలి 2పై వర్మ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. బాహుబలి 2 సినిమా, దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు. కాలాన్ని క్రీస్తు పూర్వం (బీసీ), క్రీస్తు శకం (ఏడీ)గా విభజించినట్టుగా.. భారతీయ సినిమాను కూడా బాహుబలికి ముందు (బీబీ), బాహుబలి తర్వాత (ఏబీ)గా పరిగణిస్తారని వర్మ ట్వీట్ చేశాడు.
వజ్రం లాంటి రాజమౌళిని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ గుర్తించినందుకు, బాహుబలి సినిమాను ఇష్టపడే భారతీయులందరూ ఆయనకు పాదాభివందనం చేయాలని వర్మ పేర్కొన్నాడు. ఖాన్‌లు, రోషన్‌లు, చోప్రాల కంటే రాజమౌళి గొప్పవాడని స్పష్టమైందని, అతని ప్రతిభను గుర్తించిన కరణ్ జోహార్‌కు సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశాడు. బాలీవుడ్‌లోని ప్రతి సూపర్ స్టార్, ప్రతి సూపర్ డైరెక్టర్.. బాహుబలి 2 క్రేజును చూసి వణుకుతున్నారని వర్మ వ్యాఖ్యానించాడు.
శుక్రవారం దేశ వ్యాప్తంగా 6500 స్ర్కీన్లపై విడుదలైన బాహుబలి-2 తొలిరోజు రికార్డు కలెక్షన్లు సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘బాహుబలి ది కంక్లూజన్’ పై రివ్యూలు పాజిటివ్‌గా ఉన్నాయి. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్‌ల నటనకు, సాంకేతిక నిపుణుల పనితీరుకు ప్రశంసలు వస్తున్నాయి.
Every super star nd every super director in entire Bollywood is shivering in various places looking at impact of @ssrajamouli 's Bahubali2
— Ram Gopal Varma (@RGVzoomin) 28 April 2017
Like world was divided into BC and AD (before death of Christ nd after ) Indian cinema is going to be BB and AB(before Bahubali and after)
— Ram Gopal Varma (@RGVzoomin) 28 April 2017
All people of india who luvd BB2 should touch the feet of @karanjohar for him having the genius to discover a diamond like @ssrajamouli
— Ram Gopal Varma (@RGVzoomin) 28 April 2017
Going by MegaDinosaur day1 it's clear @ssrajamouli is bigger than all Khans,Roshans and Chopras..I salute @karanjohar for discovering him
— Ram Gopal Varma (@RGVzoomin) 28 April 2017