
'ఈ దశాబ్దపు అత్యుత్తమ దర్శకుడు'
బాహుబలి 2 చిత్రంతో రాజమౌళి రేంజ్ భారీగా పెరిగిపోయింది. ఇండియన్ సినిమా కమర్షియల్ హద్దులు చెరిపేసిన రాజమౌళి, ఈ దశాబ్ధపు అత్యుత్తమ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు. బాలీవుడ్ దర్శకుడు నిర్మాత కరణ్ జోహర్. బాహుబలి సినిమాను బాలీవుడ్ లో తన బ్యానర్ పై రిలీజ్ చేస్తున్న కరణ్, సినిమాను సినిమాకు పని చేసిన యూనిట్ సభ్యులను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు.
అందులో భాగంగా రాజమౌళితో కలిసి దిగిన సెల్ఫీని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కరణ్ 'ఈ దశాబ్దపు టాప్ డైరెక్టర్ తో నేను. ఈ జీనియస్ తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. మా కాలంలో ఖచ్చితంగా ఇతనే అత్యుత్తమ దర్శకుడు' అంటూ ట్వీట్ చేశాడు కరణ్ జోహర్. ఎంతో మంది లెజెండరీ దర్శకులు ఉండగా రాజమౌళి అత్యుత్తమ దర్శకుడంటూ కరణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారాయి.
With the movie man of the decade!!!! @ssrajamouli ...it's an honour to collaborate with his genius!! Truly the BEST director of our time! pic.twitter.com/08f4oRnonS
— Karan Johar (@karanjohar) 28 April 2017