రాజమౌళిపై మహేష్ ప్రశంసలు | Mahesh Babu congratulates rajamouli, baahubali team | Sakshi
Sakshi News home page

రాజమౌళిపై మహేష్ ప్రశంసలు

Published Sat, Apr 29 2017 1:26 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

రాజమౌళిపై మహేష్ ప్రశంసలు - Sakshi

రాజమౌళిపై మహేష్ ప్రశంసలు

బాహుబలి 2పై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఇప్పటికే టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు బాహుబలి సినిమాపై స్పందించగా తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బాహుబలి టీం ను ఆకాశానికి ఎత్తేశారు. ముఖ్యం రాజమౌళిని కథ చెప్పడంలో మాస్టర్ గా కీర్తించిన మహేష్, బాహుబలి 2 అంచనాలను దాటింది అంటూ ట్వీట్ చేశాడు.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి 2 తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా ప్రచారం జరుగుతుండగా తొలి వారాంతంలో ఈ సినిమా 300 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ సినిమా రికార్డ్ లన్ని చెరిపేస్తున్న ఈ భారీ చిత్రం 1000 కోట్ల వసూళ్ల సాధిస్తుందని భావిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement