
బాహుబలికి షాక్ : పిల్లలకు నో ఎంట్రీ
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాహబలి 2కి షాక్ తగిలింది. చందమామ కథలా భారీ రాజప్రాసాదాలు, గుర్రాలు, ఏనుగులు, యుద్ధ సన్నివేశాలతో తెరకెక్కిన ఈసినిమాను ఎక్కువగా పిల్లలే ఇష్టపడతారు. అయితే సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉందన్న కారణంతో సింగపూర్ సెన్సార్ బోర్డ్ ఏ(ఎన్సీ 16) సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో 16 ఏళ్ల లోపు పిల్లలను ఆ దేశంలో బాహుబలి 2 సినిమాను చూసేందుకు అనుమతించరు.
ఈ విషయం పై స్పందించిన భారత సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ.. భారత్లో బాహుబలి 2కి ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్ను జారీ చేశాం. కానీ సింగపూర్ సెన్సార్ బోర్డ్ మాత్రం ఈ సినిమా హింసాత్మకంగా ఉందని భావించింది. ముఖ్యంగా సైనికుల తలలు నరికే సన్నివేశాలే ఏ సర్టిఫికేట్ రావడానికి కారణమన్నారు. సింగపూర్తో పాటు మరికొన్ని ఆసియా, యూరప్ దేశాల్లోనూ బాహుబలికి ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.