ఆరు గంటల్లో కోటి వ్యూస్..! | Rajamouli Baahubali 2 trailer crosses 1 crore views in 6 hours | Sakshi
Sakshi News home page

ఆరు గంటల్లో కోటి వ్యూస్..!

Published Thu, Mar 16 2017 4:12 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

ఆరు గంటల్లో కోటి వ్యూస్..! - Sakshi

ఆరు గంటల్లో కోటి వ్యూస్..!

బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే చరిత్ర సృష్టించింది. మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో విడుదలైన ఆరు గంటల వ్యవధిలోనే కోటి వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. భారతీయ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి 2 ట్రైలర్ గురువారం ఉదయం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది. ట్రైలర్ రిలీజ్ అయిన ఆరు గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి కోటికి పైగా వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. తొలి భాగం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో రెండో భాగం ఎలా ఉండబోతోందో అని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అభిమానుల అంచనాలను మరింత పెంచుతూ బాహుబలి 2, ఓ విజువల్ వండర్లా తెరకెక్కింది. భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు రాజమౌళి మార్క్ ఎమోషనల్ సీన్స్, కీరవాణి స్టైల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా అన్ని కలిసి ఈ ట్రైలర్ స్థాయిని మరింత పెంచాయి. పలువురు సినీ ప్రముఖులు ట్రైలర్ అద్భుతం అంటూ కీర్తించటం కూడా బాహుబలి రికార్డ్లను తిరగరాసేందుకు హెల్ప్ అయ్యింది. ఈ నెల 25న బాహుబలి 2 ఆడియో రిలీజ్ అవుతుండగా.. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement