
రష్యన్ సినిమాలో బాహుబలి స్టార్
కెరీర్ స్టార్టింగ్ నుంచి టాలీవుడ్తో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ వచ్చిన టాలీవుడ్ హంక్ రానా.. ఇప్పుడో హాలీవుడ్ సినిమాకు ఓకె చెప్పాడు. ఇప్పటికే బాహుబలి సినిమాలో బల్లాల దేవుడి పాత్రతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ టాల్ హీరో ఓ రష్యన్ సినిమాలో లీడ్ రోల్లో నటించేందుకు అంగీకరించాడు. ఇప్పటికే ఏ మూమెంటరీ లాప్స్ ఆఫ్ రీజన్ అనే హాలీవుడ్ సినిమాకు సైన్ చేశాడు రానా.
ఈ సినిమాలో లాస్ ఏంజెల్స్లో సెటిల్ అయిన ఇండియన్ బిజినెస్మేన్గా కనిపించనున్నాడు. ఆదిత్య భట్టాచార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ తరువాత మరో రష్యన్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించకపోయినా.. రానా యోధుడిగా కనిపించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.