
రాజమౌళికి అభినందనల వెల్లువ
హైదరాబాద్: జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న బాహుబలి 2 సినిమా దర్శకుడు రాజమౌళిపై అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్విట్టర్‌లో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్, సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ భట్, శేఖర్ కపూర్, ధనుష్, కుష్బూ సుందర్ తదితరులు రాజమౌళిని అభినందించారు. బాహుబలి 2 సినిమా చూశానని, హాలీవుడ్ స్థాయిలో ఉందంటూ వెంకయ్య నాయుడు ట్విట్టర్‌లో రాజమౌళిని అభినందించారు. రాజమౌళి స్పందిస్తూ తనకు అభినందనలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు.
టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘బాహుబలి ది కంక్లూజన్’ పై రివ్యూలు పాజిటివ్‌గా ఉన్నాయి. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్‌ల నటనకు, సాంకేతిక నిపుణుల పనితీరుకు ప్రశంసలు వస్తున్నాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తోంది.