బాహుబలి 2కు భారీ ఇన్సూరెన్స్ | Rs 200 crore insurance cover for Baahubali 2 | Sakshi
Sakshi News home page

బాహుబలి 2కు భారీ ఇన్సూరెన్స్

Published Fri, May 5 2017 2:10 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

బాహుబలి 2కు భారీ ఇన్సూరెన్స్

బాహుబలి 2కు భారీ ఇన్సూరెన్స్

రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న బాహుబలి 2 సినిమాకు సంబంధించిన ప్రతీ వార్త టాలీవుడ్ లో వైరల్ అయిపోతుంది. సినిమా రిలీజ్ తరువాత యూనిట్ సభ్యులు చేస్తున్న ప్రతి కామెంట్ ను మీడియాతో పాటు సాధరణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భారీ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తెరకెక్కించిన ఈ సినిమాకు నిర్మాణ దశలో ఏవైన ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచనతో భారీ మొత్తానికి సినిమాను ఇన్సూరెన్స్ చేయించినట్టుగా తెలుస్తోంది.

ఫ్యూచర్ జనరలి ఇన్సూరెన్స్ కంపెనీ.. ఫిలిం ఇన్సూరెన్స్ ప్యాకేజీ కింద బాహుబలి చిత్రాన్ని 200 కోట్లకు ఇన్సూరెన్స్ చేసినట్టుగా తెలిపింది. షూటింగ్ సమయంలో లేదా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఎలాంటి ప్రమాదం జరిగినా పాలసీ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. అంతేకాదు షూటింగ్ సమయంలో నటులు గాయపడినా, మరణించినా.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా షూటింగ్ ఆలస్యమైన భీమా వర్తించేలా పాలసీ చేశారు.

ప్రస్తుతం భారీ చిత్రాల నిర్మాణ పెరుగుతుండటంతో భీమ చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుందని ఫ్యూచర్ జనరలీ ఎమ్డి కేజీ కృష్ణమూర్తి తెలిపారు. కేవలం 2017లోనే 160 చిత్రాలకు ఇన్సూరెన్స్ చేశారు. వీటిలో బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. దక్షిణాదిలో ఇన్సూరెన్స్ చేస్తున్న సినిమాలు తక్కువని అందుకు ప్రస్తుతం తమ సంస్థ సౌత్ సినిమాల మీద దృష్టి పెట్టిందన్నారు కృష్ణమూర్తి. ఇప్పటి వరకు ఈ సంస్థ 372 సినిమాలకు ఇన్సూరెన్స్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement