దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన భారీ ప్రాజెక్టు బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగానే విదేశాల్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టించింది. 'బాహుబలి 2: ది కంక్లూజన్' చైనాలో విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేశారు. మే 4న చైనా ప్రేక్షకులు థియేటర్లలో బాహుబలి రెండో భాగాన్ని చూడబోతున్నారంటూ కథనాలు కొన్ని రోజులుగా వస్తున్న విషయం విదితమే.
చైనాలో విడుదల కోసం మూవీ యూనిట్ ఎడిటింగ్ నిమిత్తం హాలీవుడ్ ఎడిటర్ విన్సెంట్ టబైల్లాన్‌ను తీసుకున్నారు. ఎడిటింగ్ చేయడంలో విన్సెంట్ నిపుణుడు. 'ది ఇన్‌క్రిడబుల్ హల్క్', 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్' చిత్రాలకు పనిచేశాడు. బాహుబలి రెండో భాగం చైనాలో విజయవంతం అవుతుందని రాజమౌళి అండ్ కో ధీమాగా ఉన్నారు. ఇటీవల బాహుబలి 2 జపాన్‌లో విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. హౌస్‌ఫుల్ కలెక్షన్లు సాధిస్తున్న ‘బాహుబలి 2’ మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసి దూసుకుపోతోంది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి 2 హవా ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment