కన్నడ ప్రజలకు రాజమౌళి విజ్ఞప్తి | SS Rajamouli says Not right to stop Bahubali 2 | Sakshi
Sakshi News home page

కన్నడ ప్రజలకు రాజమౌళి విజ్ఞప్తి

Published Thu, Apr 20 2017 1:51 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

కన్నడ ప్రజలకు రాజమౌళి విజ్ఞప్తి

కన్నడ ప్రజలకు రాజమౌళి విజ్ఞప్తి

బాహుబలి 2 సినిమా రిలీజ్ పై కన్నడ ప్రజలు స్పందిస్తున్న తీరు చిత్రయూనిట్ ను ఇబ్బంది పెడుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోతే కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో కన్నడ ప్రజలకు రాజమౌళి స్వయంగా రిలీజ్ అడ్డుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. తన సోషల్ మీడియా పేజ్ లో ఓ వీడియో పోస్ట్ చేసిన రాజమౌళి కన్నడలో మాట్లాడి వారికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేశాడు.

నాకు కన్నడ సరిగా రాదు.. ఏవైనా తప్పులుంటే క్షమించండి అంటూ ప్రారంభించిన జక్కన చాలా ఏళ్ల క్రితం సత్యరాజ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు సినిమాను అడ్డుకోవద్దని కోరారు. ఆ వ్యాఖ్యలు కేవలం సత్యరాజ్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని, వాటితో బాహుబలి యూనిట్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సినిమా కోసం ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టపడి పని చేశారు. రిలీజ్ అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని, బాహుబలి తొలి భాగాన్ని ఆదరించినట్టుగానే కన్నడ ప్రేక్షకులు బాహుబలి రెండో భాగాన్ని కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement