జపాన్ బాక్సాఫీస్ బద్దలు కొట్టిన బాహుబలి | Baahubali 2 Crosses 1 Million Mark At Japan Boxoffice | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 4 2018 10:56 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

Baahubali 2 Crosses 1 Million Mark At Japan Boxoffice - Sakshi

‘బాహుబలి 2’ జపనీస్‌ పోస్టర్‌

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించటమే కాదు ప్రపంచ దేశాల్లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ఇటీవల జపాన్‌ లో రిలీజ్‌ అయిన బాహుబలి అక్కడి ప్రజలు ఘనవిజయాన్ని అంధించారు. బాహుబలి సినిమాలో క్యారెక్టర్స్‌కు ఫిదా అయిన జపాన్‌ ప్రజలు థియేటర్లలో ఆ పాత్రల వేశధారణలో సందడి చేశారు.

తాజాగా బాహుబలి 2 జపాన్‌ లో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికీ హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతున్న ‘బాహుబలి 2’ వన్‌ మిలియన్‌ డాలర్‌ మార్క్‌ను క్రాస్‌ చేసింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు బాహుబలి 2లోని సాహోరే పాట యూట్యూబ్‌ లో 100 మిలియన్ల (పదికోట్ల) వ్యూస్‌ సాధించింది. గత ఏడాది ఏప్రిల్‌ 28న రిలీజ్‌ అయిన బాహుబలి 2 హవా ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement