నువ్వు ఆగు మిత్రమా.. నేను వెళతాను..!! | China Fans Unique Salute To Baahubali | Sakshi
Sakshi News home page

నువ్వు ఆగు మిత్రమా.. నేను వెళతాను..!!

Published Fri, May 11 2018 3:41 PM | Last Updated on Fri, May 11 2018 7:10 PM

China Fans Unique Salute To Baahubali - Sakshi

ప్రభాస్‌పై అభిమానంతో ఓ చైనా ఫ్యాన్‌ చేసిన చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : బాహుబలి-ది కంక్లూజన్‌ పార్ట్‌కు చైనీయులు ఫిదా అయిపోయారు. హీరో ప్రభాస్‌ను ఏకంగా హాలీవుడ్‌ స్టార్స్‌తో పోల్చుతూ ఓ చైనీయుడు చేసిన పోస్టు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. బ్లాక్‌ పాంథర్‌ను కలిసిన ప్రభాస్‌.. తాను ముందు వెళ్తానని ఆపుతున్నట్లు, శత్రువును చీల్చిచెండాటానికి వెళ్తున్న ఎవెంజర్స్‌ సీరియస్‌గా చూస్తుంటే.. ప్రభాస్‌ మాత్రం చిరునవ్వుతో శత్రువును చూస్తున్నట్లు ఫొటోషాప్‌ చేసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.

ఈ నెల 4వ తేదీన బాహుబలి 2ను చైనాలో విడుదల చేశారు. 10 తేదీ వరకూ చిత్రం రూ. 68 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు తెలిసింది. అయితే, చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-5 చిత్రాలకు భారీ దూరంలోనే ప్రభాస్‌ ఉన్నాడని చెప్పుకోవాలి. చైనాలో దంగల్‌, సిక్రెట్‌ సూపర్‌ స్టార్‌, బజరంగీ భాయిజాన్‌, హిందీ మీడియం, పీకే చిత్రాలు వరుసగా అత్యధిక వసూళ్లు రాబట్టాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement