
బాహుబలి 2 తొలి షో పడిందా..?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బాహుబలి ఫీవర్ నడుస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి 2 ఈ శుక్రవారం భారీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు యూనిట్ చెప్పిన సమాచారం ప్రకారం గురువారం ( ఏప్రిల్ 27) సాయంత్రం ఓవర్ సీస్ ప్రీమియర్ షోలతో బాహుబలి 2 రిలీజ్ కానుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కొన్ని ఫోటోలు, ఇప్పటికే ప్రీమియర్ పడిందా అన్న అనుమానాలు కలిస్తోంది.
సిల్వర్ స్క్రీన్ మీద బాహుబలి 2 టైటిల్ తో పాటు, ప్రభాస్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ప్రభాస్ స్టిల్ టీజర్, సాంగ్ ప్రొమోస్ లో కనిపించింది కాకపోవటంతో ప్రీవ్యూస్ స్టార్ట్ అయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే నిజంగానే ప్రీవ్యూ షోస్ స్టార్ట్ అయ్యాయా.. లేక ఆ ఫోటోలు బాహుబలి టీం, సెన్సార్ టీం లు సినిమా చూస్తున్నప్పుడు తీసినవా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.