మరో రెండు భాషల్లోకి బాహుబలి-2 | baahubali 2 may dubbed into two more languages | Sakshi
Sakshi News home page

మరో రెండు భాషల్లోకి బాహుబలి-2

Published Thu, May 4 2017 7:54 AM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM

మరో రెండు భాషల్లోకి బాహుబలి-2

మరో రెండు భాషల్లోకి బాహుబలి-2

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్రదర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి విజువల్‌ వండర్‌ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’   బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్‌ లోనూ రికార్డులు తిరగరాస్తుంది. కేవలం భారత్‌ లోనే కాదు అమెరికా, సహా ఇతర దేశాల్లో కొత్త చర్రిత లిఖిస్తోంది బాహుబలి-2. ఈ మూవీని మరో రెండు భాషల్లోకి డబ్బింగ్‌ చేసి రెండు దేశాల ప్రేక్షకులకు ఈ విజువల్‌ వండర్‌ ను చేరువ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో తొమ్మిది వేల స్క్రీన్లపై విడుదలైన తొలి టాలీవుడ్‌ చిత్రంగానూ బాహుబలి-2 రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.

‘బాహుబలి: ది బిగనింగ్‌’  మూవీకి చైనాలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తొలిభాగం చైనాలో మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో, రెండో భాగమైన బాహుబలి-2ను చైనీస్‌ భాషలోకి డబ్బింగ్‌ చేసి చైనా ప్రేక్షకులకు చేరువ కావాలని కసరత్తు మొదలుపెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్‌. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కు భారీస్థాయిలో అభిమానులున్న జపాన్‌ లోనూ విడుదల చేస్తే బాహుబలి-2 ప్రభంజనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్‌, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ మూవీ ఇప్పటికే రూ.800 కోట్లు కొల్లగొట్టి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరనున్న తొలి భారతీయ చిత్రంగా నిలవనుందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement