ప్రభాస్‌ గురించి ఓ ఫన్నీ సీక్రెట్‌ చెప్పిన రాజమౌళి | Prabhas ate 15 varieties of biryani, reveals SS Rajamouli | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ గురించి ఓ ఫన్నీ సీక్రెట్‌ చెప్పిన రాజమౌళి

Published Mon, Jun 5 2017 4:41 PM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

ప్రభాస్‌ గురించి ఓ ఫన్నీ సీక్రెట్‌ చెప్పిన రాజమౌళి

ప్రభాస్‌ గురించి ఓ ఫన్నీ సీక్రెట్‌ చెప్పిన రాజమౌళి

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డులు సృష్టిస్తున్న చిత్రం బాహుబలి 2. వసూళ్ల పరంగా భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా ఈ సినిమా దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ పలురకాలుగా బాహుబలి 2 మానియా కొనసాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ఆసక్తిని రేపుతుండగా చిత్ర దర్శకుడు రాజమౌళి ఈ సినిమా హీరో ప్రభాస్‌ గురించి ఓ ఫన్నీ సీక్రెట్‌ చెప్పాడు. కండలు తిరిగిన ప్రభాస్‌ దేహం వెనుక బిర్యానీ మాయ ఉందంట. అవునూ సినిమా కోసం ప్రభాస్‌, రానాలు తమ దేహాన్ని ఎంత ఫిట్‌నెస్‌గా ఉంచుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రానా గురించి పక్కన పెడితే ప్రభాస్‌ మాత్రం 15 రకాల బిర్యానీలు తినేవాడంట. ఈ విషయాన్ని రాజమౌళి బ్రిటన్‌లో ఓ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులకు తెలియజేశారు. చేపలు, మటన్‌తో కూడిన బిర్యానీలు, అందులో కర్రీలు, ఫ్రైలతో తెగ లాగించేశాడంట. ‘వాళ్లు(ప్రభాస్‌, రానా) ఎలాంటి డైట్‌ఫాలో అయినా నేను అడ్డు చెప్పే వాడిని కాదు. వారిపై ఒత్తిడి కూడా చేయలేదు. కానీ, ఈ సందర్భంగా మీకు ప్రభాస్‌ గురించి ఓ ఫన్నీ సంఘటన చెబుతాను. ప్రభాస్‌ బాహుబలి 2 షూటింగ్‌ సమయంలో కనీసం 10 నుంచి 15 రకాల బిర్యానీలు తినేవాడు’ అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు రాజమౌళి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement