
బాహుబలిని తట్టుకున్న పవర్ పాండి
భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి–2’ విడుదలైన సమయంలో మరో సినిమా రిలీజ్ అంటే రిస్కే. అందుకే ఈ సినిమా విడుదలైన ఏప్రిల్ 28న వేరే ఏ తెలుగు సినిమాలనూ విడుదల చేయలేదు. అంతకు వారం క్రితం రిలీజైన వాటిలో కూడా ఆశించిన ఫలితాన్ని సాధించినవి లేవు. కానీ, తమిళంలో మాత్రం ‘పవర్ పాండ్’ చిత్రం ‘బాహుబలి–2’ని తట్టుకుని నిలబడింది. హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదలైంది. మొదటి రోజునే హిట్ టాక్ తెచ్చుకోవ డంతో ప్రేక్షకాదరణ పెరిగింది.
‘బాహుబలి–2’ విడుదలయ్యాక కూడా ఈ సినిమా వసూళ్లు నిలకడగా ఉండటం విశేషం. ఈ చిత్రం సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ధనుష్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ పార్ట్‌లో సీనియర్ నటుడు రాజ్‌కిరణ్ టైటిల్ రోల్ చేశారు. ధనుష్ అతిథి పాత్ర చేశారు. సీక్వెల్‌లో మామ రజనీకాంత్‌ను నటింపజేయాలని ధనుష్ అనుకుంటున్నారట.