50 రోజులు, 1050 సెంటర్లు | Baahubali 2 movie completes 50 days | Sakshi
Sakshi News home page

50 రోజులు, 1050 సెంటర్లు

Published Fri, Jun 16 2017 8:55 AM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

50 రోజులు, 1050 సెంటర్లు

50 రోజులు, 1050 సెంటర్లు

హైదరాబాద్‌: బాక్సాఫీసు వద్ద ‘బాహుబలి 2’ హవా కొనసాగుతోంది. ఇప్పటికే రికార్డులు మీద రికార్డులు సాధించిన ఈ చిత్రరాజం మరో ఘనత సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల నేటికి 50 రోజులు పూర్తయింది. దేశవ్యాప్తంగా 1050 సెంటర్లలో ఇంకా ‘బాహుబలి 2’  సినిమా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.

50 రోజులు గడిచినా ఈ సినిమాకు ఆదరణ తగ్గకపోవడం విశేషం. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం నిలిచిన ‘బాహుబలి 2’  మున్ముందు మరిన్ని రికార్డులు సృష్టించనుంది. త్వరలో చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీంతో ఆల్‌టైమ్‌ రికార్డు కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచే అవకాశముందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూ. 2 వేల కోట్లు సాధించే తొలి భారతీయ సినిమా అవుతుందని భావిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ హైయ్యస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఇప్పటి వరకు రూ. 1650 కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా, ఈ నెల 22న ప్రారంభం కానున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి 2ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనుండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement