
బాహుబలి 2లో ఐదు తప్పులు..!
బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అదే స్థాయిలో యూనిట్ ప్రసంశల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు బాహుబలి 2పై తమ అభిప్రాయాలు వెల్లడించగా. యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ మాత్రం ఆసక్తికరంగా స్పందిచాడు. బాహుబలి 2లో ఐదు తప్పులున్నాయంటూ తన ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేశాడు. ఇంతకీ విఘ్నేష్ చెపుతున్న ఆ తప్పులేంటంటే.
'1. కేవలం 120 రూపాయలకే సినిమా చూడాల్సి రావడం. దీనికి పరిష్కారం, నిర్మాత కోసం థియేటర్ల ముందు కలెక్షన్ బాక్స్ లు పెట్టాలి.
2. సినిమా డ్యూరేషన్ చాలా తక్కువగా ఉంది. మూడు గంటల్లోనే సినిమా పూర్తయిపోవడాన్ని సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
3. అత్యంత డీటెయిల్డ్ గా సినిమాను చిత్రీకరించటం.. దీని వల్ల ఇన్నాళ్లు తాము పర్ఫెక్ట్ గా సినిమా చేస్తున్నామనుకునే చాలా మంది దర్శకుల తల పొగరు తగ్గుతుంది.
4. ఇది కన్క్లూజన్ అవ్వడానికి వీల్లేదు. ఈ సీరీస్ లో మరో పది సినిమాలు త్వరలోనే చూడాలని కోరుకుంటున్నాం.
5. భవిష్యత్తు ఎంతో కష్టంగా ఉండనుంది. ఎందుకంటే ఈ స్థాయి రికార్డ్ లను బద్ధలు కొట్టి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలంటే మన పరిశ్రమకు ఎన్నో ఏళ్లు పడుతుంది.'
అంటూ తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన విఘ్నేష్ శివన్, రాజమౌళి, ప్రభాస్, రమ్యకృష్ణ, సత్యరాజ్ రానాలకు శుబాకాంక్షలు తెలిపాడు.
5 Mistakes in #Baahubali2
— Vignesh ShivN (@VigneshShivN) 1 May 2017
Frm Legend @ssrajamouli sir's Masterpiece!
TakeABow@meramyakrishnan #prabas #satyaraj @RanaDaggubati &team pic.twitter.com/GRPD3HLnVH