బాహుబలి 2పై బ్యాన్ తప్పదా..?
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి 2 రిలీజ్ కోసం పాకిస్తాన్ సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. అంతేకాదు అక్కడి ప్రేక్షకులు బాహుబలి 2ను పాక్లో రిలీజ్ చేయాలంటే సోషల్ మీడియలో పెద్ద ఎత్తున మేసేజ్లు కూడా పెడుతున్నారు. దీంతో బాహుబలి నిర్మాతలు కూడా పాక్ రిలీజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది.
భారత్లో తెరకెక్కిన చాలా సినిమాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ల లోనూ రిలీజ్ అవుతుంటాయి. షారూఖ్ లాంటి స్టార్ హీరోలకు పాకిస్తాన్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే బాహుబలి రిలీజ్పై పాక్ సెన్సార్ బోర్డ్ ఎలా స్పందిస్తుందో అన్న అనుమానం కలుగుతుంది. హిందుత్వాన్ని ప్రమోట్ చేసే సన్నివేశాలున్న సినిమాలను పాక్లో రిలీజ్ చేసేందుకు అక్కడి సెన్సార్ బోర్డ్ అంగీకరించదు.
గతంలో ఈ కారణంగానే సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్జాన్ సినిమాపై పాక్ బ్యాన్ విధించింది. అయితే బాహుబలి సినిమా కావాలంటూ పాకిస్తాన్ యువతే కోరుతుండటంతో ఈ సినిమాపై సానుకూలంగా స్పందిస్తారనే ఆశిస్తున్నారు. మరి బాహుబలి పాక్లో రిలీజ్ అవుతుందా..? లేక బ్యాన్ బారిన పడుతుందా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.