రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్పై మరో న్యూస్ | Rajamouli Next film with allu arjun | Sakshi
Sakshi News home page

రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్పై మరో న్యూస్

Published Sun, Apr 30 2017 10:26 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్పై మరో న్యూస్ - Sakshi

రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్పై మరో న్యూస్

బాహుబలి 2 సినిమాతో ప్రపంచాన్ని తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలితో దేశంలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకడిగా నిలిచిన రాజమౌళి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి. చాలా రోజులుగా సినీ అభిమానులను వేదిస్తున్న ప్రశ్న ఇది. బాహుబలి కన్నా భారీగా మహాభారతాన్ని తెరకెక్కిస్తాడని కొద్ది రోజులు ప్రచారం జరిగింది.

అయితే రాజమౌళి స్వయంగా ఇప్పట్లో మహాభారతం ఉండదన్న స్టేట్మెంట్ ఇచ్చేయటంతో.. ఓ బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడని, టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోతో చిన్న సినిమా చేస్తాడని రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రాజమౌళి ప్రముఖ నిర్మాత డివివి దానయ్య బ్యానర్ లో సినిమా చేసేందుకు చాలా కాలం క్రితమే అడ్వాన్స్ తీసుకున్నారట. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమాలో  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించనున్నాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ ఆ తరువాత లింగుస్వామితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఒక వేళ జక్కన్న లైన్ లోకి వస్తే లింగుస్వామి సినిమాను పక్కన పెట్టేసి రాజమౌళి సినిమాకే ఓటేసే ఆలోచనలో ఉన్నాడట. మరి నిజంగానే ఈ ప్రాజెక్ట్ రెడీ అవుతుందా లేదా తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement