బాహుబలి 2కు మరో అరుదైన గౌరవం
రికార్డ్ కలెక్షన్లు సాధించి బిగెస్ట్ ఇండియన్ ఫిలింగా అవతరించిన బాహుబలి సంచలనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితమైన ఈ సినిమాను మరో ప్రెస్టీజియస్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఈ నెల 22న ప్రారంభం కానున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి 2ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు.
ఇటీవల జరిగి కేన్స్ ఫిలిం ఫెస్టివల్తో పాటు రొమేనియా ఫిలిం ఫెస్టివల్ లోనూ బాహుబలి 2కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్కోలోనే అదే స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ హైయ్యస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఇప్పటి వరకు 1650 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలో చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో రిలీజ్కు ప్లాన్ చేస్తుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.