బాహుబలి 2.. మూడు కిలోమీటర్ల క్యూ | Hyderabad in midst of Baahubali storm, 3km lines for tickets | Sakshi
Sakshi News home page

బాహుబలి 2.. మూడు కిలోమీటర్ల క్యూ

Published Thu, Apr 27 2017 11:28 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

బాహుబలి 2.. మూడు కిలోమీటర్ల క్యూ - Sakshi

బాహుబలి 2.. మూడు కిలోమీటర్ల క్యూ

మరో 24గంటల్లో బాహుబలి 2 విడుదలకానుంది. దాదాపు రెండేళ్లపాటు ఆసక్తి ఎదురుచూసిన జనం ఇప్పుడిక ఆగలేమంటూ థియేటర్ల బాటపట్టారు. ఎక్కడపడితే అక్కడ భారీగా క్యూలు దర్శనం ఇస్తున్నాయి. సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్న ఓ వీడియో ఒకటి బాహుబలి 2 మానియా ఎంత ఉందో చూపిస్తోంది. ప్రసాద్‌ ఐమాక్స్‌ ఆరుబయట దాదాపు మూడు కిలో మీటర్ల పొడవునా క్యూ కట్టి ఉన్నట్లు అందులో కనిపిస్తోంది. ఉదయం 7గంటల ప్రాంతంలో ఆ వీడియో తీసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆన్‌లైన్‌లో చాలామంది బుక్‌ చేసుకున్నా థియేటర్‌ వద్ద నిల్చొని టికెట్‌ పొందిన వారి ముఖాల్లో మాత్రం సంతోషం వెళ్లి విరుస్తోంది. నగరంలో టికెట్‌ అత్యధిక ధర రూ.250వరకే ఉండగా చిత్ర పరిశ్రమ వర్గాల ప్రకారం టికెట్‌కు రూ.600 అంతకంటే మించి చెల్లించి మరీ తీసుకెళుతున్నారంట. బ్లాక్‌లో మాత్రం ఒక్క టికెట్‌ వెయ్యి నుంచి రూ.4వేల వరకు విక్రయిస్తున్నారని సమాచారం. ఏదేమైనా మొత్తానికి బాహుబలి 2 తుఫాన్‌ మరోసారి ప్రేక్షకులను థియేటర్ల ముంచెత్తుతోందని స్పష్టమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement