హాలీవుడ్ సినిమాలకన్నా బాహుబలికే ఎక్కువ..! | Baahubali 2 Demand in Dubai | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ సినిమాలకన్నా బాహుబలికే ఎక్కువ..!

Published Wed, Apr 26 2017 12:51 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

హాలీవుడ్ సినిమాలకన్నా బాహుబలికే ఎక్కువ..! - Sakshi

హాలీవుడ్ సినిమాలకన్నా బాహుబలికే ఎక్కువ..!

ఈ శుక్రవారం రిలీజ్కు రెడీ అవుతున్న బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన బాహుబలి అడ్వాన్స్ బుకింగ్స్లోనూ అదే జోరు చూపిస్తోంది. కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్ సీస్లోనూ బాహుబలి అడ్వాన్స్ బుకింగ్స్ సరికొత్త రికార్డ్లు నమోదు చేస్తున్నాయి. పలు హాలీవుడ్ చిత్రాలను కూడా వెనక్కి నెట్టి బాహుబలి సత్తాచాటుతోంది.

గల్ఫ్ దేశాల్లో భారీగా రిలీజ్ అవుతున్న బాహుబలి, అడ్వాన్స్ బుకింగ్స్లో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ విషయాన్ని బాహుబలి గల్ఫ్ డిస్ట్రిబ్యూటర్ ఫార్స్ ఫిలిమ్స్ అధినేత గులాన్ స్వయంగా వెల్లడించాడు. ఇప్పటికే బాహుబలి 2కు సంబంధించి లక్షకు పైగా టికెట్లు అమ్ముడైనట్టుగా ప్రకటించారు. హాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8కు కూడా ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదని వెల్లడించారు. ప్రస్తుతం బాహుబలి టీం దుబాయ్లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement