KGF Director Prashanth Neel Remuneration For Junior NTR 31 - Sakshi
Sakshi News home page

తారక్‌ సినిమా కోసం ప్రశాంత్‌ నీల్‌ ఎంత తీసుకుంటున్నారంటే..

Published Tue, May 25 2021 10:37 AM | Last Updated on Tue, May 25 2021 11:19 AM

KGF Director Prashanth Neel Remuneration For Junior NTR 31 - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వరుస సినిమాలో ఫుల్‌ బిజీ అయ్యాడు. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’షూటింగ్‌ పూర్తవకముందే.. రెండు సినిమాలో ప్రకటించాడు. అందులో ఒకటి కొరటాల శివ ప్రాజెక్ట్‌ కాగా, రెండోది కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ది. ఇప్పటికే ప్రభాస్‌తో ‘సలార్‌’మూవీని పట్టాలెక్కిస్తున్న ప్రశాంత్‌ నీల్‌.. ఆ తర్వాత ఎన్టీఆర్‌ సినిమాని ప్రారంభించనున్నాడు.  ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు ప్రశాంత్‌ నీల్‌ భారీగానే తీసుకుంటున్నాడట. అయితే రాజమౌళి, సుకుమార్‌తో పోలిస్తే అంత ఎక్కువేం కాదట. ఈ సినిమా కోసం ప్రశాంత్‌ నీల్‌ రూ.10 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నాడని టాక్‌.  కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చేస్తున్న సలార్ కూడా ఇంత రెమ్యునరేషన్‌ తీసుకోలేదట ప్రశాంత్‌ నీల్‌. దీంతో ఎన్టీఆర్‌ సినిమాకు ఇచ్చే రెమ్యునరేషన్‌ పట్ల ప్రశాంత్‌ నీల్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నాడట.

వాస్తవానికి ఎన్టీఆర్‌ సినిమాకి రూ. 20 కోట్లు  తీసుకునే చాన్స్‌ ఉన్నప్పటికీ అతను ఎక్కువగా ఆశ పడలేదు. ఆయన దర్శకత్వం వహించిన కేజీఎఫ్‌-2, సలార్‌ చిత్రాలు విడుదల అనంతరం ఈ ప్రాజెక్టు అనౌన్స్‌ చేసి ఉంటే ప్రశాంత్‌ నీల్‌కు ఎక్కువే రెమ్యునరేషన్‌ అందేదనేది ఫిల్మ్‌ వర్గాల మాట. మరి ఆ చిత్రాలు విడుదలై హిట్టయితే ప్రశాంత్‌ నీల్‌ రెమ్యునరేషన్‌ పెరుగుతుందో లేదో చూడాలి. 
చవండి:
ఏ సాంగ్స్‌ చేయడం లేదు: పాయల్‌ రాజ్‌పుత్‌
మహేశ్‌ 'పార్థు' మూవీ! ఫారిన్‌లో షూట్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement