Is Actress Sreeleela Hikes Her Remuneration For Upcoming Movies, Deets Inside - Sakshi
Sakshi News home page

Sreeleela Hikes Remuneration: భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన శ్రీలీల? షాకవుతున్న నిర్మాతలు!

Published Sat, Nov 12 2022 11:31 AM | Last Updated on Sat, Nov 12 2022 12:43 PM

Is Actress Sreeleela Hikes Remuneration For Her Upcoming Movies - Sakshi

తొలి సినిమాతోనే ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయింది పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచిన ఇందులో హీరోయిన్‌గా చేసిన శ్రీలీల మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తెరపై శ్రీలీల అందం, అభినయంకు తెలుగు ప్రేక్షకుల ఫిదా అయ్యారు. దీంతో టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆమె స్టార్‌ హీరోల సరసన నటించే చాన్స్‌ కొట్టేసింది. ప్రస్తుతం రవితేజ చిత్రం ధమకాలో హీరోయిన్‌గా చేస్తోంది. వీటితో పాటు రామ్‌ పోతినేని-బోయపాటి, బాలకృష్ణ-అని రావిపూడి కాంబినేషన్లో రాబోయో చిత్రాల్లో హీరోయిన్‌గా ఖరారైనట్లు సమాచారం.

ఇవి రెండు భారీ చిత్రాలు కావడంతో శ్రీలీల తన రెమ్యునరేషన్‌ను భారీ పెంచేసిందట. మొదటి సినిమా పెళ్లి సందడికి కేవలం 5 లక్షలు మాత్రమే తీసుకున్న శ్రీలీల రవితేజ సినిమాకు 50 లక్షల వరకు డిమాండ్ చేసిందట. లేటెస్ట్‌గా రామ్  సినిమాకు 80 లక్షల నుంచి కోటి రూపాయల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తోంది. ఇక ఆఫర్‌ కోసం తన దగ్గరకు వచ్చే దర్శక-నిర్మాతలకు కోటి పైనే పారితోషికం డిమాండ్‌ చేస్తోందని ఫిలిం దూనియాలో వినికిడి. ఇంకా ఒక్క హిట్‌ పడకుండానే ఆమె ఈ రెంజ్‌లో డిమాండ్‌ చేయడంపై దర్శక-నిర్మాతలు షాకవతున్నారట.  ఇక ఈ అమ్మడి దూకుడు చూస్తుంటే తగ్గేదే లే అన్నట్లు ఉందంటున్నారు ఆమె ఫ్యాన్స్‌. 

చదవండి: 
నా గ్లామర్‌ ఫొటోలు చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు: హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్
హీరోతో అభ్యంతరకర సీన్‌.. నా తల్లిదండ్రులకు చెప్పే చేశా: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement