పవన్‌ కల్యాణ్‌ రెమ్యునరేషన్‌పై పోసాని సంచలన వ్యాఖ్యలు | Posani Krishna Murali Sensational comments On Pawan Kalyan Remuneration In Press Meet | Sakshi
Sakshi News home page

Pawan Kalyan Remuneration: ‘పవన్‌ అది నిరూపిస్తే నన్ను చెంపదెబ్బ కొట్టండి’

Published Mon, Sep 27 2021 8:33 PM | Last Updated on Tue, Sep 28 2021 2:31 PM

Posani Krishna Murali Sensational comments On Pawan Kalyan Remuneration In Press Meet - Sakshi

Posani Krishna Murali comments On Pawan Kalyan Remuneration: జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సాయి ధరమ్‌ తేజ్‌ రిపబ్లిక్‌ మూవీ ప్రిరిలీజ్‌ కార్యక్రమంలో పవన్‌ చేసిన కామెంట్స్‌పై పోసాని స్పందించారు. సోమవారం ఆయన ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతూ పవన్‌ రెమ్యునరేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటాడని ఆయన ఆరోపించారు.

చదవండి: సీఎం వైఎస్‌ జగన్‌తో పవన్‌కు పోలికే లేదు : పోసాని

ఈ మేరకు ఆయన ‘పవన్‌ నీ రెమ్యునరేషన్‌ 10 కోట్లా.. 50 కోట్లా అని ప్రశ్నించారు. పవన్ సినిమాకు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్‌ మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నాడు.  అదే నేను ఒక్క సినిమా రూ. 15 కోట్ల చొప్పున ఇస్తాను 4 సినిమాలకు సంతకం చేస్తాడా? ఆయన చేసే సినిమాలోని హీరోయిన్‌ను, లోకేషన్‌, పారితోషికం, కథ తానే స్వయంగా సెలెక్ట్‌ చేసుకుంటాడు. తన సినిమాలకు రూ. 50 కోట్లు తీసుకోవట్లేదని పవన్‌ నిరూపిస్తే.. నన్ను చెంపదెబ్బ కొట్టండి’ అని పోసాని వ్యాఖ్యనించారు. 

చదవండి: మహేశ్‌ కామెంట్స్‌పై స్పందించిన సాయి పల్లవి

అలాగే పవన్‌ కల్యాణ్‌ సినిమా అంటే టిక్కెట్‌కు రూ. 500, 1000 వసూళ్లు చేయడమంటే ఏంటని, అది మధ్య తరగతి, సామాన్యులను హింసించడమే కదా అన్నారు. హీరోలు అంటే ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లని, వారు ఏనాడు డిస్ట్రిబ్యూషన్‌ విషయంలో, డబ్బు విషయంలో వేలు పెట్టేవారు కాదన్నారు. వారు తెరమీదే కాదు నిజ జీవితంలోనూ రియల్‌ హీరోలని పేర్కొన్నారు. అంతేగాక మెగాస్టార్‌ చిరంజీవి సంస్కారవంతుడని, ఆయనను చూసి పవన్‌ నేర్చుకోవాలన్నారు. ఆనాడు చిరంజీవి ఇంట్లోని అడపడిచులను అసాసినెట్ చేస్తే పవన్‌ ఎక్కడ ప్రస్నించారన్నారు. దానిపై తాను ప్రశ్నించానని, అందుకే అప్పుడు వాళ్లు తనని చంపుతామని బెదిరించినట్లు పోసాని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement