బుల్లితెరపై బిగ్‌బాస్ సందడి మొదలైంది. ఆడయన్స్‌కి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఈసారి 21 మందిని రంగంలోకి దింపాడు బిగ్‌బాస్. ఆదివారం(సెప్టెంబర్ 4న) అట్టహాసంగా ప్రారంభమైంది బిగ్‌బాస్ 6వ సీజన్. మూడు నెలల పాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు నటి కీర్తిభట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చాలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గలాటా గీతు, అభినయ శ్రీ, రోహిత్ సాహ్ని, మరీనా, బాలాదిత్య, వాసంతి క్రిష్ణన్, షాని సాల్మన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, రాజేశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డిలు వరుసగా హౌజ్‌లో అడుగు పెట్టారు.
చదవండి: చై-సామ్ విడాకులపై సమంత తండ్రి ఎమోషనల్
వీరిలో టీవీ, సినీ నటీనటులు, యాంకర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు కామనర్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తొలి రోజు పరిచయాలు, ఓదార్పులతో మొదలవుతుందనుకున్న ఈ షోలో అప్పడే గొడవలు, ఇగోలు మొదలయ్యాయి. చూస్తుంటే కంటెస్టెంట్స్ మధ్య అండర్‌స్టాండింగ్ కంటే మనస్పర్థలే ఎక్కువ వచ్చేలా ఉన్నాయంటున్నారు తొలి ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు. ఇక ఏదేమైన హౌజ్ అంతా ఫుల్ సందడి చేస్తున్నా ఈ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో 21 కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి రెమ్యునరేషన్ బయటకు వచ్చిది. ఈ తాజా బజ్ ప్రకారం.. నటి కీర్తి భట్ రూ. 35 వేలు తీసుకుంటుందట.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీతో ఫేం సంపాదించుకున్న పంకీ అలియాస్ సుదీపా రూ. 20 వేలు అందుకుంటుందట. మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ సిరీ బాయ్‌ఫ్రెండ్‌గా గుర్తింపు పొందిన నటుడు శ్రీహాన్, కమెడియన్ చలాకి చంటిలు రూ. 50 వేలు చొప్పున తీసుకుంటున్నారని వినికిడి. యాంకర్ నేహా చౌదరి రూ. 20వేలు, లేడీ కమెడియన్ ఫైమా సీరియల్ యాక్ట్రస్ వాసంతిలకు రూ. 25 వేలు చొప్పున ఇస్తున్నారట. క్యాటరిగ్ బాయ్ నుంచి మోడల్‌గా ఎదిగిన రాజశేఖర్ రూ. 20 వేలు చొప్పున అందుకుంటున్నారట. ఇక మెడియన్ చలాకి చంటి రూ. 50 వేలు ఇస్తున్నారట బిగ్‌బాస్. టీవీ నటులు, రియల్ కపుల్ మరినా అబ్రహం రూ. 35వేలు, ఆమె భర్త రోహిత్ రూ. 45వేలు అందుకున్నారట. ఇక యాంకర్ ఇనయా సుల్తాన, యాంకర్ అరోహి రావ్ అలియాస్ అంజలిలు రూ. 15వేలు చొప్పున తీసుకుంటున్నారని తెలుస్తోంది.
చదవండి: లలిత్ మోదీతో సుస్మితా బ్రేకప్? అసలేం జరిగింది!
అలాగే సినీ, టీవీ నటుడిగా, బాల నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్య రూ. 45 వేలు తీసుకుంటున్నాడని సమాచారం. నితిన్ ‘సై’ మూవీలో తన కామెడి, ఆటతో అలరించిన షానీ సాల్మోన్‌కు రూ. 30వేలు కాగా, ఆర్జే సూర్య రూ. 40 అందుకుంటున్నాడని సమాచారం. టిక్‌టాక్ స్టార్ నుంచిమోడల్, టీవీ నటిగా మారిన శ్రీసత్యకు రూ. 30వేలు కాగా, ఆర్యలో ఆ అంటే అమలాపురం అంటూ కుర్రకారును అలరించిన అభినయకు రూ. 20 వేలు ఇస్తున్నారట. చిత్తూరు చిరుత అలియాస్ గీతూ రాయల్‌కు రూ. 25 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్‌ర్ ఆదిరెడ్డికి రూ. 30వేల కాగా.. ఇండియన్ ఐడల్ విజేత, సింగర్ రేవంత్ అందరికంటే ఎక్కువ రూ. 60 వేలు పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం. అయితే ఇది రోజుకా, వారం రోజులకా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment