రష్మిక ఇక 'తగ్గేదే లే'.. రెమ్యునరేషన్‌ పెంచేసిన శ్రీవల్లి ! | Rashmika Mandanna Increased Remuneration After Pushpa | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: రష్మిక ఇక 'తగ్గేదే లే'.. రెమ్యునరేషన్‌ పెంచేసిన శ్రీవల్లి !

Published Sun, Jan 9 2022 7:43 PM | Last Updated on Sun, Jan 9 2022 8:00 PM

Rashmika Mandanna Increased Remuneration After Pushpa - Sakshi

Rashmika Mandanna Increased Remuneration After Pushpa: తెలుగులో 'ఛలో' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ సరసన నటించిన 'గీత గోవిందం' సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తర్వాతి సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన రష్మిక ప్రతి ఈవెంట్‌లో తన అల్లరి చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు గుండెల్లో నేషనల్‌ క్రష్‌గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇటీవల ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో జంటగా నటించిన 'పుష్ప: ది రైజ్‌' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అందులో శ్రీవల్లిగా రష్మిక ఫ్యాన్స్‌తోపాటు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. 

అయితే వరుస విజయాలతో జోరు మీద ఉన్న  అమ్మడు తన రెమ్యునరేషన్‌ పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్‌ ఇండియా చిత్రంగా వచ్చిన పుష్ప 5 భాషల్లో రిలీజ్‌ కావడంతో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకుంది రష్మిక. అంతేకాకుండా హిందీలో కూడా పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోంది. దీంతో పారితోషికాన్నిపెంచేసిందన్న వార్త ఫిల్మ్‌ దునియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రూ. 1.75 నుంచి 2 కోట్ల వరకు తీసుకున్న రెమ్యునరేషన్‌ను రూ. 3 కోట్ల వరకు డిమాండ్‌ చేస్తోందట ఈ ఎక్స్‌ప్రెషన్‌ క్వీన్‌. రష్మిక మందన్నా ప్రస్తుతం హిందీలో 'మిషన్‌ మజ్ను', 'గుడ్‌ బై' చిత్రాలు చేస్తోంది. తెలుగులో శర్వానంద్‌కు జంటగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు', పుష్ప సీక్వెల్‌ 'పుష్ప: ది రూల్‌' సినిమాలు రష్మిక చేతిలో ఉన్నాయి. 



ఇదీ చదవండి: మారిపోయిన రష్మిక పేరు.. మందన్నా కాదట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement