నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాల స్పీడు పెంచింది. ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. దీనిపై ఇటీవల అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన సమంత అక్కడ కూడా అవకాశాలు దక్కించుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లోనూ నటించేందుకు సామ్ మొగ్గు చూపుతోందని టాక్. అయితే ఇప్పుడు సమంత రెమ్యునరేషన్ విషయంతో మరో సారి వారల్లో నిలిచింది.
విడాకుల తర్వాత సమంత తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తదుపరి తాను చేయబోయే సినిమాలకు రూ.3 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందట. మాములుగా అయితే సమంత ఒక్కో సినిమాకు రూ.3కోట్ల కంటే తక్కువే తీసుకునేదట. కానీ ప్రస్తుతం మాత్రం జీఎస్టీ కాకుండా రూ.3 కోట్లు ఇవ్వాలని కండీషన్ పెట్టిదట.
జోరు మీద ఉన్న పూజా హెగ్డే, రష్మిక కూడా రూ. 2.5 కోట్ల లోపే పారితోషికం తీసుకుంటున్నారు. సమంత మాత్రం ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేయడం నిర్మాతలకు కాస్త భారమైనప్పటికీ.. ఆమెకు ఉన్న డిమాండ్ దృష్ట్యా అంతమొత్తం పారితోషికంగా ఇవ్వడానికి వెనుకాడడంలేదట. ఇన్నాళ్లు బాలీవుడ్ భామలే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవారు..ఇప్పుడు దక్షిణాది బ్యూటీలు కూడా రెమ్యునరేషన్ విషయంలో పోటీ పడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment