Pushpa Movie కోసం బన్నీ షాకింగ్‌ రెమ్యునరేషన్‌ | Allu Arjun Remuneration For Pushpa Part 2 Will Leave You In Shock | Sakshi
Sakshi News home page

Pushpa Movie: రెమ్యునరేషన్‌ భారీగా పెంచిన బన్నీ, ఎంతంటే..

Published Sat, May 15 2021 5:11 PM | Last Updated on Sat, May 15 2021 7:13 PM

Allu Arjun Remuneration For Pushpa Part 2 Will Leave You In Shock - Sakshi

Allu Arjun: క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ ‘పుష్ప’. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు.దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఫిల్మ్‌లో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు.

పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ ప్రయత్నిస్తుంది. ఇందులో మొదటి భాగం అక్టోబర్‌లో, రెండో భాగం వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం బన్నీ భారీ రెమ్యునరేషన్‌ తీసుకోబోతున్నారనేదే ఈ వార్త సారాంశం. 

వాస్తవానికి ‘పుష్ప'ను రెండు భాగాలుగా విడుదల చేయాలని ముందుగా భావించలేదు. కానీ, సినిమాలో చెప్పాల్సిన కంటెంట్ రెండింటికి సరిపోయేంతగా ఉండడంతో ఇటీవలే ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట ఒకే భాగమని చెప్పడంతో బన్నీ రూ.25 కోట్లకు ఒప్పుకున్నాడట. దీనితో పాటు సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటా అడిగాడని ప్రచారం జరిగింది.

ఇక ఇప్పుడు నిర్మాతలు మనసు మార్చుకొని రెండు పార్టులుగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడంతో బన్నీ కూడా పారితోషికాన్ని పెంచేశాడట. రెండో భాగానికి ఏకంగా రూ. 50 తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ సినిమా కోసం బన్నీ బాగా కష్ట పడుతున్నాడు. అతని కష్టానికి తగ్గట్లే రెమ్యునరేషన్‌ అడిగాడని, దానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement