Bigg Boss 16: Here How Much Salman Khan is Charging for The Upcoming Season - Sakshi
Sakshi News home page

Bigg Boss Reality Show: రూ. 1000 కోట్ల రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిన హీరో?

Published Fri, Jul 15 2022 3:25 PM | Last Updated on Fri, Jul 15 2022 3:58 PM

Bigg Boss 16: Here How Much Salman Khan is Charging for The Upcoming Season - Sakshi

ప్రముఖ బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినీ, టీవీ సెలబ్రెటీలను మూడు నెలల పాటు ఒకే గూటిలో లాక్‌ చేసి ప్రేక్షకులకు వినోదం అందిస్తోంది ఈ షో. ఇక వారి మధ్య జరిగే గొడవలు, మనస్పర్థలు, మాటల యుద్దం, ప్రేమ వంటి ఆసక్తికర సంఘటనలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. తెలుగులో బిగ్‌బాస్‌ 5 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో హిందీలో ఏకంగా 15 సీజన్లు జరుపుకుంది. ఇప్పుడు 16వ సీజన్‌కు రెడీ అవుతోంది.

చదవండి: వెడ్డింగ్‌ యానివర్సరీ.. భర్తను తలచుకుంటూ మీనా ఎమోషనల్‌ పోస్ట్‌

ఈ క్రమంలో బాలీవుడ్‌ బిగ్‌బాస్‌ 16వ సీజన్‌కు సంబంధించి ఓ షాకింగ్‌ న్యూస్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా హిందీ బిగ్‌బాస్‌కు బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తనదైన స్టైల్‌, మ్యానరీజం, వాక్‌చతర్యంతో సల్మాన్‌ బిగ్‌బాస్‌ షోను సక్సెస్‌ ఫుల్‌గా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన అడిగినంత రెమ్యూనరేషన్‌ ఇచ్చేందుకు నిర్వహకులు సైతం నో చెప్పడం లేదు. గత సీజన్‌ ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 15 కోట్ల చొప్పున అందుకున్న భాయిజాన్‌ 16వ సీజన్‌కు షాకింగ్‌ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నాడని టాక్‌. ఇక ఆయన ఎంత అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న షో నిర్వహకులు సల్మాన్‌ డిమాండ్‌ విన్నాక ఒక్కసారిగా అవాక్కయ్యారట.

చదవండి: ప్రముఖ నటుడు, నటి రాధిక మాజీ భర్త మృతి

ఇంతకి ఆయన అడిగిన రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే మీకు కూడా కళ్లు చెదరడం ఖాయం అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. 16వ సీజన్‌ మొత్తానికి ప్యాకేజీ కింద సుమారుగా 1000 కోట్ల రూపాయలకు పైగా డిమాండ్‌ చేశాడట. ఇక ఆయన ఫ్యాన్సీ రెమ్యునరేషన్‌ చూసి అంతా కంగుతిన్నారట. ఇక సల్మాన్‌కు ఉన్న క్రేజ్‌ బట్టి ఆయన అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే బిగ్‌బాస్‌ టీం స్పందించే వరకు వేచి చూడాలి. కాగా బిగ్‌బాస్‌ 16న సీజన్‌ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుందట. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ మొదటి వారంలో ఈ షో ప్రారంభం కానుందని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement