
జాన్వీ కపూర్ అంటే బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. దివంగత శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది. ఇటీవలే మిలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది. తాజాగా జాన్వీ కపూర్‌పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సౌత్ సినిమాల్లో నటించేందుకు రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
(ఇది చదవండి: ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. రామ్‌చరణ్‌కు షారూక్ ఖాన్ విజ్ఞప్తి)
సౌత్ సినిమాల్లో నటించేందుకు భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో నటించేందుకు జాన్వీ కపూర్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, సీతారామం బ్యూటీ మృనాల్ ఠాకూర్ కంటే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె ఎంత డిమాండ్ చేసిందన్నా విషయం ఇప్పటివరకు ఎవరూ వెల్లడించలేదు. ఆమె డిమాండ్‌కు చిత్ర నిర్మాతలు అంగీకరిస్తే సౌత్ సినిమాల్లో జాన్వీ కపూర్ కనిపించనుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ బావాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment