NTR 30 Update: Janhvi Kapoor Locked For Jr NTR And Kortala Siva Next Movie - Sakshi
Sakshi News home page

NTR30 Update: టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైన జాన్వీ.. ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్..!

Published Mon, Feb 13 2023 3:17 PM | Last Updated on Mon, Feb 13 2023 4:00 PM

Janhvi Kapoor locked for Jr NTR and Kortala Siva next Movie NTR30 - Sakshi

‘జనతా గ్యారేజ్‌’ సూపర్ హిట్‌ ఫిల్మ్‌ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో కొత్త సినిమా  తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్,  మిక్కిలినేని సుధాకర్‌ నిర్మించనున్నారు. ఈ సినిమాకు తాత్కాలికంగా ఎన్టీఆర్30 టైటిల్ ఖరారు చేశారు. అయితే  ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 

అయితే ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ కపూర్ నటించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ 30 చిత్రంలో నటించేదుకు జాన్వీ ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో టాలీవుడ్‌లో జాన్వీ ఎంట్రీ యంగ్‌ టైగర్‌తోనే మొదలవనుంది. దీనిపై ఈ నెలాఖరులో మరింత స్పష్టత రానుంది. ఎన్టీఆర్ 30 చిత్ర బృందం గత 6 నెలలుగా పలువురు హీరోయిన్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.  

కానీ చివరికి జాన్వీ కపూర్‌ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్‌కు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేయడం ఖాయం. అయితే ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నెలాఖరులోగా సెట్స్‌పైకి వెళ్లాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ నటిస్తున్న చిత్రమిదే.  ఈ సినిమాను ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.  ఈ చిత్రం ఫిబ్రవరి 23 నుంచి సెట్స్‌పైకి వెళ్లి 6 నుంచి 7 నెలల వ్యవధిలో పూర్తి చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement