
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీదేవికి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ బాలీవుడ్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. గతేడాది మిలి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది ముద్దుగుమ్మ. అయితే తాజాగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది జాన్వీ. అది కూడా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్‌లో అవకాశం రావడం పట్ల జాన్వీ కపూర్ స్పందించింది. ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
జాన్వీ కపూర్ మాట్లాడూతూ.. 'ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో పనిచేసే అవకాశం వస్తే బాగుండని చాలాసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పా. ప్రతి రోజూ దేవుడిని అదే కోరుకునేదాన్ని. కానీ ఫైనల్‌గా అది నెరవేరనుంది. ఎన్టీఆర్30 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆతృతగా ఉన్నా.సెట్‌లోకి అడుగు పెట్టేందుకు దర్శకుడికి రోజూ మెసేజ్‌లు పెడుతున్నా. ఇప్పటికే రెండుసార్లు ఆర్‌ఆర్‌ఆర్ చూశా. ఆయన అందం, ఎనర్జీ ఎంతో గొప్పగా ఉంటాయి.' అని చెప్పుకొచ్చింది. అలాగే తన సినీ కెరీర్‌పై పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
(ఇది చదవండి: రామ్ చరణ్‌కు ప్రభుదేవా బిగ్ సర్‌ప్రైజ్.. అదేంటంటే!)
జాన్వీ తన కెరీర్‌పై మాట్లాడుతూ.. 'సినీ పరిశ్రమకు చెందిన కుటుంబంలో పుట్టినందుకు సంతోషంగా ఉంది. నా కెరీర్ ప్రారంభంలోనే గుర్తింపు పొందుతున్నానంటే దానికి కారణం నా పేరేంట్స్. నేను ధరించే దుస్తులు కాకుండా.. నా నటనను అందరూ గుర్తించాలి. అలాగే సినిమాల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపించేందుకు యత్నిస్తారు. గట్టిగా నవ్వితే తప్పని కొందరు.. ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతే పొగరంటారు. కానీ వాటి గురించి ఆలోచించను. మన పనేదో చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవడమే’’ అని అన్నారు.
కాగా.. జాన్వీ తర్వాత వరుణ్ ధావన్‌తో కలిసి బవాల్ చిత్రంలో కనిపించనుంది. ఇటీవలే పోలాండ్‌లో తమ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7, 2023న విడుదల కానుంది. ఆమె తన తదుపరి చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంలో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment