![Jr NTR Devara Movie Second Single Out Now](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/08/5/devaa.jpg.webp?itok=lhv1VlaP)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం దేవర. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
తాజాగా ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'చుట్టమల్లే చుట్టేస్తావే' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శిల్పారావు ఆలపించారు. కాగా.. ఇప్పటికే దేవర నుంచి ఫియర్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే దేవర సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment