'జైలర్' హవా ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. సూపర్‌స్టార్ రజినీకాంత్ దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కళ్లుచెదిరే వసూళ్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో రజినీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బాగా హైలైట్ అయ్యాడు. మరి 'జైలర్'కి మరో హీరో అయిన అనిరుధ్‌కి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మీరు అవాక్కవడం గ్యారంటీ.
రజినీకాంత్ 'జైలర్' స్టోరీ నార్మల్‌గా ఉన్నప్పటికీ.. ఈ రేంజులో సినిమా హిట్ అయిందంటే దానికి కారణం అనిరుధ్ అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సాధారణమైన సీన్స్‌ని కూడా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. 'హుకుమ్' పాట అయితే ఇంకా ఫ్యాన్స్ చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఇలాంటి టైంలో అనిరుధ్ రెమ్యునరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది.
(ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు)
'జైలర్' హీరోగా నటించిన రజినీకాంత్‌కు రూ.110 కోట్ల పారితోషికం ఇచ్చారని సమాచారం. ఇక మిగిలిన వారిలో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కే ఎక్కువట. ఏకంగా రూ.10 కోట్ల వరకు ఇతడు అందుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు రూ.8 కోట్లు మాత్రమే తీసుకున్న అనిరుధ్.. 'జైలర్'తో ఏఆర్ రెహమాన్(రూ.8 కోట్లు)నే దాటేశాడు. అలానే ఇతడు ప్రస్తుతం అందుకుంటున్న మొత్తం, చాలామంది యంగ్ హీరోలకు ఇచ్చేదాని కంటే ఎక్కువ అని చెప్పొచ్చు.
మరోవైపు అనిరుధ్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తెలుగు నిర్మాతలు కూడా మనోడి వెంట పడుతున్నారు. రూ.10 కోట్లు కంటే ఎక్కువే ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు పవన్ 'అజ్ఞాతవాసి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. నాని 'జెర్సీ'తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్-కొరటాల కాంబోలో తీస్తున్న 'దేవర' కోసం పనిచేస్తున్నాడు. ఏదేమైనా సరే ఓ సంగీత దర‍్శకుడు గురించి ఇంతలా మాట్లాడుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.
(ఇదీ చదవండి: స్టార్ హీరోకు గాయాలు.. మొదలైన రోజే ఇలా!)
Comments
Please login to add a commentAdd a comment