భారతీయ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా పేరుగాంచిన నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన సినిమాలు విడుదలైతే ఆ తేదీకి తమిళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం పరిపాటి. తెలుగులో కూడా స్టార్ హీరోకు ఏ మాత్రం తగ్గని క్రేజ్.. తన సినిమాల కలెక్షన్ల రికార్డులను ఆయన మాత్రమే తిరిగి కొట్టగలడు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన వరుస సినిమాలు పర్వాలేదనిపించడంతో ఆయనపై రకరకాల విమర్శలు చుట్టుముట్టాయి. ఈ దశలోనే నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో రజనీ నటించనున్నట్లు ప్రకటించారు. దీంతో కోలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే అంతకుముందే నెల్సన్- విజయ్ కాంబోలో వచ్చిన బీస్ట్ చిత్రం డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో రజనీపై ఆ ప్రెజర్ పడింది. కానీ రజనీ మాత్రం నెల్సన్‌ను నమ్మి జైలర్ అవకాశం ఇచ్చాడు.ఈ చిత్రంలో తమన్నా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కూడా ప్లస్ అయ్యారు. ఆగస్ట్ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలై విశేష స్పందనను అందుకుంది. విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్స్ వర్షం కురిసింది. దీంతో రజనీకాంత్ కూడా చాలా సంతోషించారు.
ఈ మెగా హిట్ విమర్శకులందరికీ సమాధానంగా నిలిచింది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్ని చోట్ల మంచి వసూళ్లు రాబట్టింది. విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. జైలర్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.650 కోట్లు దాటింది. అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఇద్దరి ప్రత్యేక సన్నివేశాలు సినిమా విజయానికి దోహదపడ్డాయి. గత ఏడాది విడుదలై తమిళ చిత్రసీమలో భారీ విజయాన్ని సాధించిన 'పొన్నియన్ సెల్వన్', కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' చిత్రాల కలెక్షన్లను 'జైలర్' బీట్ చేసింది.
దీంతో చాలా ఖుషీగా ఉన్న సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ తాజాగ (ఆగస్టు 31) రజనీకాంత్‌ను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. సినిమా లాభాల్లో కొంత భాగాన్ని రజనీకాంత్‌కి కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. రజనీకాంత్‌కు ఇచ్చిన చెక్కును కవర్‌పై 'ది రియల్ రికార్డ్ మేకర్' అని రాసి ఉండటం గమనార్హం.
రజనీకాంత్‌కు గిఫ్ట్‌గా రెండు కార్లు తీసుకెళ్తే..
ఈ చెక్‌తో పాటు ఆయనకు బీఎండబ్ల్యూ కారును కూడా కళానిధి మారన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. రెండు బీఎండబ్ల్యూ కారులను ఆయన రజనీ వద్దకు తీసుకువెళ్లి.. అందులో నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలని కోరారు. బీఎండబ్ల్యూ ఎక్స్7 మోడల్ కారును రజనీ సెలెక్ట్ చేసుకున్నారు. దీని ధర సుమారు రూ. 2.25 కోట్లు అని సమాచారం. అందుకు సంబంధించిన వీడియోను సన్ పిక్చర్స్ వారు షేర్ చేశారు.
ఇప్పటికే ఈ సినిమాకు రెమ్యునరేషన్‌గా రూ. 110 కోట్లు రజనీకాంత్ తీసుకున్నారని టాక్.. సినిమాకు భారీగా లాభాలు రావడంతో చిత్ర నిర్మాత కళానిధి మారన్ మరో రూ.100 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఇలా మెత్తంగా జైలర్ కోసం రజనీకాంత్ అందుకున్న పారితోషకం రూ . 210 కోట్లకు చేరింది. ఇదీ ఇండియన్ సినీ చరిత్రలో రికార్డ్‌గా నిలవనుంది. ఇప్పటికీ కూడా పలు థియేటర్లలో జైలర్ మానీయా నడుస్తూనే ఉంది.
#JailerSuccessCelebrations continue! Superstar @rajinikanth was shown various car models and Mr.Kalanithi Maran presented the key to a brand new BMW X7 which Superstar chose. pic.twitter.com/tI5BvqlRor
— Sun Pictures (@sunpictures) September 1, 2023
Mr. Kalanithi Maran met Superstar @rajinikanth and handed over a cheque, celebrating the historic success of #Jailer pic.twitter.com/Y1wp2ugbdi
— Sun Pictures (@sunpictures) August 31, 2023
Comments
Please login to add a commentAdd a comment