మ్యూజిక్ ఇస్తే రూ.10 కోట్లు.. పాడితే మాత్రం పూర్తిగా ఫ్రీ | Sathish: Anirudh Ravichander Never Charges For Singing Songs For Other Music Directors - Sakshi
Sakshi News home page

Anirudh: అనిరుధ్ డబ్బులు తీసుకోకుండా పాడతాడు.. ఎందుకో తెలుసా?

Oct 2 2023 6:18 PM | Updated on Oct 3 2023 1:34 PM

Anirudh Ravichander Sang Without Money For Other Music Directors - Sakshi

సినిమా హిట్ కావాలంటే హీరోలుండాలనేది పాత మాట. అనిరుధ్ కూడా ఉండాలనేది కొత్త మాట. ఎందుకంటే సాదాసీదా మూవీస్‌ని కూడా తన మ్యూజిక్‌తో బ్లాక్‌బస్టర్స్ చేస్తున్నాడు. అతడి పేరే అనిరుధ్ రవిచందర్. రీసెంట్‌గా రిలీజైన జైలర్, జవాన్ సినిమాలతో మనోడి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఒక్కో సినిమా కోసం రూ.10 కోట్ల వరకు తీసుకునే అనిరుధ్.. అస్సలు డబ్బులు తీసుకోకుండా పాడతాడని మీలో ఎంతమందికి తెలుసు?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)

అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన అనిరుధ్.. ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 10 కోట్లు వరకు తీసుకుంటున్నాడని సమాచారం. తన సినిమాల్లో కాకుండా ఇతర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన పాటలు కూడా పాడుతుంటాడు. ఇలా పాడుతున్నందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోడు. ఈ విషయాన్ని స్వయంగా అనిరుధ్ బయటపెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఈ సంగతి రివీల్ చేశాడు.

పాడటం తన ప్రొఫెషన్ కాదని కానీ దాన్ని ఎంజాయ్ చేస్తానని, అందుకే వేరే సంగీత దర్శకులు ఎవరైనా వచ్చి అడిగితే ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వాళ్లకోసం పాట పాడుతానని అనిరుధ్ చెప్పాడు. ఇలా చేయడం వల్ల వాళ్ల కంపోజింగ్ స్టైల్ తెలుస్తుందని, అది తన మ్యూజిక్ స్టైల్‌ని అప్డేట్ చేసుకునే విషయంలో ఉపయోగపడుతుందని అన్నాడు. ఇది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ ఇస్తే కోట్లు తీసుకునే ఓ మ్యూజిక్ డైరెక్టర్.. సింగర్‌గా ఫ్రీగా పాడతాడంటే విశేషమే కదా!

(ఇదీ చదవండి: 'బిగ్‪‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement