
పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత నటి ప్రియాంక మోహన్‌కు అతికినట్లు సరిపోతుంది. ఈమె చేసిన చిత్రాలు తక్కువే అయినా పారితోషికం విషయంలో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కన్నడ భామ 2019లో మాతృభాషలో కథానాయికగా పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్ పిలిచింది. అక్కడ నాని గ్యాంగ్ లీడర్, శ్రీకారం చిత్రాలను చకచక చేసేసింది. అవి అంత హిట్టు సాధించకపోయినా కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది.
ఇక్కడే ఈ బ్యూటీకి లక్కు కలిసివచ్చింది. శివ కార్తికేయన్‌తో జతకట్టిన డాక్టర్ చిత్రం సక్సెస్ అయింది. ఆ వెంటనే సూర్యతో ఎదర్కుమ్ తుణిందవన్ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ప్రియాంక మోహన్ కెరీర్‌కి ఎలాంటి ఎఫెక్ట్ కాకపోవడం విశేషం. ఆ వెంటనే మరోసారి శివ కార్తికేయన్ జంటగా డాన్ చిత్రంలో నటించి మరో విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్ ఈమెకు అన్ని విధాలా మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. నటిగా వయసు మూడేళ్లే.
మూడు భాషల్లో ఇప్పటికి చేసిన చిత్రాలు కేవలం అరడజనే.. పారితోషికం మాత్రం భారీ మొత్తంలో పుచ్చుకుంటోందని తాజా సమాచారం. రెండు శతాబ్దాలుగా పలు భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న త్రిష లాంటి వారు కూడా మొన్నటి వరకు కోటి రూపాయల కంటే తక్కువే పారితోషికాన్ని తీసుకున్నారు. అలాంటిది నటి ప్రియాంక మోహన్ క్రేజీ హీరోయిన్లకు సమానంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఈ జాణ ధనుశ్‌కు జంటగా కెప్టెన్ మిల్లర్, జయం రవి సరసన దర్శకుడు ఎం.రాజేష్ తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment