బిగ్‌బాస్‌ 5: స్పెషల్‌ ఎపిసోడ్‌లో ఆది, 25 నిమిషాలకే షాకింగ్‌ రెమ్యునరేషన్‌! | Hyper Aadi Remuneration For Bigg Boss 5 Telugu Special Episode | Sakshi
Sakshi News home page

Bigg Boss 5: 25 నిమిషాలకే షాకింగ్‌ రెమ్యునరేషన్‌ అందుకున్న హైపర్‌ ఆది!

Published Wed, Oct 13 2021 8:29 AM | Last Updated on Wed, Nov 10 2021 6:11 PM

Hyper Aadi Remuneration For Bigg Boss 5 Telugu Special Episode - Sakshi

ప్రముఖ బుల్లితెర కమెడియన్‌ హైబర్‌ ఆది క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా తన కామెడీ, టైమింగ్‌ పంచులతో ఆది బుల్లితెరపై నవ్విస్తుంటాడు. బయట జరిగిన కొన్ని సంఘటనలను, కాన్‌టెంపరరీ ఇష్యూస్ తీసుకుని అదిరిపోయే కామెడీ చేయడంలో హైపర్ ఆది సిద్ధహస్తుడు. అలా అతడు స్టేజ్‌పై ఉన్నంత సేపు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఆది ప్రముఖ రీయాలిటీ షో తెలుగు బిగ్‌బాస్‌ 5కి అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: బిగ్‌బాస్‌ పత్తేపారం.. రవి, లోబో, శ్వేతలకు జాక్‌పాట్‌

నవరాత్రి ఉత్సవాలు పేరుతో ఆదివారం బిగ్‌బాస్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ను నిర్వహించారు. ప్రేక్షకులకు రెట్టింపు వినోదం అందించేందుకు ఈషోకు మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ హీరోహీరోయిన్‌ అఖిల్‌, పూజ హెగ్డేతో పాటు నటి మీనాక్షి, హెబ్బా పటెల్‌, నాట్యం నటి వచ్చి తమ డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌తో అలరించారు. దీనితో పాటు కాస్తా కామెడీ టచ్‌ ఇచ్చేందుకు బిగ్‌బాస్‌ నిర్వహకులు ఆదిని తీసుకువచ్చారు. పోలీసు ఆఫీసర్‌గా బిగ్‌బాస్‌ స్టేజ్‌పైకి వచ్చిన ఆది అందరిని ఓ రెంజ్‌లో నవ్వించాడు. ఈ షోలో 25 నిమిషాల పాటు కనిపించిన ఆది పోలీసు ఆఫీసర్‌గా వచ్చి బిగ్‌బాస్‌ హౌజ్‌మెట్స్‌పై ఇన్వెస్టిగేషన్‌ చేశాను అంటూ వారి చరిత్ర అంతా విప్పాడు.

చదవండి: బన్నీవాసుపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సునీత బోయ

హౌజ్‌లో ఎవరెవరు ఏం చేశారు, ఎలా ఆడుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో అన్ని బయటపెడుతూనే తనదైన శైలిలో హౌజ్‌మేట్స్‌పై పంచ్‌లు, సటైర్లు వేశాడు. అలా ఈ షోలో గెస్ట్‌గా తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. చెప్పాలంటే ఆది ఉన్నంత సేపు బిగ్‌బాస్‌ ప్రేక్షకులంతా కూడా ఫుల్‌గా నవ్వేసుకున్నారు. అంతలా వినోదం పంచిన ఆది భారీగానే రెమ్యునరేషన్‌ అందుకున్నాడట. కేవలం 25 నిమిషాలు కనిపించినందుకే దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నాడని సమాచారం. కాగా గతేడాది కూడా దసరా సందర్భంగా బిగ్‌బాస్‌ 4 సీజన్‌కు సమంత హోస్ట్‌గా రాగా అదే ఎపిసోడ్‌కు ఆది గెస్ట్‌గా వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement